హైదరాబాద్ లెమన్‌ట్రీ హోటల్‌లో దారుణం.. ప్రియురాలి గొంతుకోసి చంపి, ప్రియుడి ఆత్మహత్య
- యువతీయువకులు ఇద్దరూ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందినవారే
- ప్రేయసి గొంతును బ్లేడుతో కోసి ఆపై ఉరేసుకున్న ప్రియుడు
- క్షణికావేశంలోనే ఘటన జరిగి ఉంటుందన్న పోలీసులు
హైదరాబాద్, మాదాపూర్‌లోని లెమన్‌ట్రీ హోటల్‌లో దారుణం జరిగింది. ఓ యువకుడు తన ప్రేయసిని చంపి, ఆపై తను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నిన్న సాయంత్రం జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. యువతిని వికారాబాద్ జిల్లా బొంరాసుపేట మండలం లగచర్లకు చెందిన సంతోషి (25)గా గుర్తించారు. యువకుడిని నారాయణపేట జిల్లా కోస్గి మండలంలోని హకీంపేటకు చెందిన జి.రాములు (25)గా గుర్తించారు. హోటల్ సిబ్బంది సమాచారంతో హోటల్‌కు చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.
పోలీసుల కథనం ప్రకారం.. సంతోషి ప్రభుత్వ ఉద్యోగం కోసం సిద్ధమవుతుండగా, రాములు రెండు కార్లు కొనుక్కుని హైదరాబాద్‌లో ట్రావెల్స్ వ్యాపారం చేస్తున్నాడు. లాక్‌డౌన్ సమయంలో స్వగ్రామానికి వెళ్లిన రాములుకు సంతోషితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. బుధవారం వీరిద్దరూ నగరానికి వచ్చి లెమన్‌ట్రీ హోటల్‌లోని మూడో అంతస్తులో ఉన్న 317 నంబరు గదిలో దిగారు.
నిజానికి వీరు గురువారం మధ్యాహ్నం గదిని ఖాళీ చేయాల్సి ఉండగా, మరో రోజుకు పొడిగించారు. అయితే, గురువారం సాయంత్రం వారి మధ్య గొడవ జరిగినట్టు తెలుస్తోంది. అదే సమయంలో అటువైపుగా వెళ్తున్న రూమ్ బాయ్ లోపలి నుంచి వస్తున్న అరుపులు విని సిబ్బందికి చెప్పాడు. ఆ తర్వాత చాలా సేపటి వరకు రూము నుంచి ఎలాంటి మాటలు వినిపించకపోవడంతో అనుమానం వచ్చిన సిబ్బంది మారుతాళంతో గది తలుపులు తెరిచి చూశారు. బాత్రూములో సంతోషి మృతదేహం కనిపించగా, రాములు మృతదేహం ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది.
బాత్రూములో సంతోషి మృతదేహం నగ్నంగా పడి ఉంది. రాములు ఆమె మెడను బ్లేడుతో కోసి హతమార్చినట్టు పోలీసులు గుర్తించారు. అనంతరం ఆమె చున్నీతో రూములోని ఫ్యాన్‌కు రాములు ఉరివేసుకున్నట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అంతకుముందు వీరిద్దరి మధ్య గొడవ జరిగి ఉంటుందని, విచక్షణ కోల్పోయి రాములు ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని పోలీసులు చెబుతున్నారు.
హత్యకు ఉపయోగించిన బ్లేడ్, ఇతర ఆధారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంతోషికి చెందిన వివిధ పోటీ పరీక్షలకు చెందిన పుస్తకాలు, ఓ ప్రైవేటు ఈఎన్‌టీ ఆసుపత్రికి సంబంధించిన ఫైల్, ఆధార్ కార్డులు లభించాయి. నిజానికి వీరిద్దరూ గతంలో ప్రేమ పెళ్లి చేసుకున్నారని, పెద్దలు అంగీకరించకపోవడంతో విడిగా ఉంటున్నట్టు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.