శ్రీలంక ముందు స్వల్ప లక్ష్యం... 20 ఓవర్లలో 81 పరుగులు చేసిన భారత్
- కొలంబోలో టీమిండియా, లంక మూడో టీ20
- మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా
- విఫలమైన ప్రధాన బ్యాట్స్ మెన్
- 23 పరుగులతో టాప్ స్కోరర్ గా కుల్దీప్ యాదవ్
శ్రీలంకతో మూడో టీ20 మ్యాచ్ లో భారత్ స్వల్పస్కోరుకు పరిమితమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేసింది. పెద్దగా బ్యాటింగ్ తెలియని లెఫ్టార్మ్ బౌలర్ కుల్దీప్ యాదవ్ 23 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడంటే భారత బ్యాటింగ్ ఏ విధంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. భువనేశ్వర్ కుమార్ 16, రుతురాజ్ గైక్వాడ్ 14 పరుగులు చేశారు. కెప్టెన్ ధావన్, సంజు శాంసన్ డకౌట్ అయ్యారు. లంక బౌలర్లలో స్పిన్నర్ వనిందు హసరంగ 4 వికెట్లతో భారత్ ను దెబ్బతీశాడు. కెప్టెన్ దసున్ షనక 2, మెండిస్ 1, చమీర 1 వికెట్ తీశారు.