చైనాలోనూ డెల్టా వేరియంట్ కేసులు... అప్రమత్తమైన అధికార యంత్రాంగం

  • నాన్ జింగ్ నగరంలో డెల్టా వేరియంట్ ఉనికి
  • ఎయిర్ పోర్టులో పారిశుద్ధ్య కార్మికులకు కరోనా
  • వారి సన్నిహితులకు కరోనా పరీక్షలు
  • 200 మందికి పాజిటివ్
  • అన్నీ డెల్టా కేసులేనన్న అధికారులు
కరోనా వైరస్ పుట్టినిల్లయిన చైనాలో ఇప్పుడు డెల్టా వేరియంట్ ఉనికి వెల్లడైంది. అనేక నగరాల్లో డెల్టా వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి. ఒక్క నాన్ జింగ్ నగరంలోనే 200 వరకు పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. కొన్నిరోజుల కిందట నాన్ జింగ్ ఎయిర్ పోర్టులో 9 మంది పారిశుద్ధ్య కార్మికులకు కరోనా సోకింది. దాంతో వారి సంబంధీకులకు, వారు కలిసిన వారికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలో 200 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ కాగా, అవన్నీ డెల్టా వేరియంట్ కేసులేనని అధికారులు వెల్లడించారు. దీంతో కరోనా కట్టడి చర్యలు ముమ్మరం చేశారు.

కరోనా నివారణకు సొంతంగా వ్యాక్సిన్లు అభివృద్ధి చేసిన చైనా, వాటిని ప్రజలకు యుద్ధప్రాతిపదికన అందించింది. అయితే డెల్టా వేరియంట్ కేసులు వెల్లడి అవుతున్న నేపథ్యంలో, ఆ టీకాలు సరైన రక్షణ కనబర్చలేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.


More Telugu News