తృణమూల్ ఎంపీ తనను ‘బీహారీ గూండా’ అన్నారంటూ బీజేపీ ఎంపీ ఫిర్యాదు!
- తన జీవితంలో మాట పడలేదన్న నిశికాంత్ దూబే
- మహువా క్షమాపణలు చెప్పాలని డిమాండ్
- మీటింగ్ కే రాని వారిని ఎలా కామెంట్ చేస్తానన్న మహువా
- కావాలంటే హాజరు పట్టిక చూసుకోవాలని సూచన
తనను ‘బీహారీ గూండా’ అంటూ తృణమూల్ ఎంపీ మహువా మోయిత్రా కామెంట్ చేశారని బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే ఆరోపించారు. ఇవాళ పార్లమెంట్ లో చర్చ సందర్భంగా ఆయన ఈ ఆరోపణలు చేశారు. ఐటీ పార్లమెంటరీ కమిటీ సమావేశం సందర్భంగా ఆమె తనపై ఆ వ్యాఖ్యలు చేశారని, తన జీవితంలో ఇలాంటి మాటలు ఎన్నడూ పడలేదని ఆయన అన్నారు. ఈ దేశాన్ని బాగు చేయాలనుకోవడమే తాము చేసిన తప్పా? అని ప్రశ్నించారు.
తాము కూలి పనులు చేసుకుని పైకొచ్చామని, శ్రీరాముడి నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకున్నామని చెప్పారు. ఆ విషయంపై స్పీకర్ కు మహువా మోయిత్రా మీద దూబే ఫిర్యాదు చేశారు. హిందీ వాళ్లంటే తృణమూల్ పార్టీ వారికి అసహ్యమని, అందుకే ఆ కామెంట్లు చేశారని ఆయన ఆరోపించారు. ఆమె క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
అయితే, దీనిపై మహువా మోయిత్రా స్పందించారు. తనపై వచ్చిన ఆరోపణలు ఆశ్చర్యానికి గురి చేశాయని ఆమె అన్నారు. అసలు ఆ మీటింగ్ కే రాని వారి గురించి తానెలా అలాంటి వ్యాఖ్యలు చేస్తానని ప్రశ్నించారు. కావాలంటే మీటింగ్ కు ఎవరెవరొచ్చారో హాజరు పట్టికను తీసి చూసుకోవచ్చని చెప్పారు. కాంగ్రెస్ , తృణమూల్ పార్టీ ఎంపీలకు ఆ ట్వీట్ ను ఆమె ట్యాగ్ చేశారు. తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని ఆమె అన్నారు.