ఇండియా నుంచి యూఏఈకి విమానాలను ఆపేసిన ఎతిహాద్ ఎయిర్ లైన్స్

  • కరోనా నేపథ్యంలో ఇండియా నుంచి వచ్చే విమానాలపై యూఏఈ ప్రభుత్వం నిషేధం
  • ప్రభుత్వ సూచనల మేరకు భారత్ నుంచి విమానాలను ఆపేస్తున్నామన్న ఎతిహాద్
  • కార్గో విమానాలను నడుపుతామని వెల్లడి
ఇండియా నుంచి యూఏఈకి వచ్చే విమాన సర్వీసులను ఆపేస్తున్నట్టు ఎతిహాద్ ఎయిర్ లైన్స్ ప్రకటించింది. కరోనా నేపథ్యంలో భారత్ నుంచి యూఏఈకి విమానాల రాకపోకలపై నిషేధం విధిస్తున్నట్టు యూఏఈ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో... ఎతిహాద్ ఎయిర్ లైన్స్ అధికార ప్రతినిధి ఈ ప్రకటన చేశారు.

 యూఏఈ ప్రభుత్వ సూచనల మేరకు తాము ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. తాము తదుపరి ప్రకటనను వెలువరించేంత వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని అన్నారు. అయితే యూఏఈ జాతీయులు, రాయబార కార్యాలయ ఉద్యోగులు, గోల్డెన్ రెసిడెంట్ హోల్డర్లకు మాత్రం నిషేధం నుంచి మినహాయింపు ఉంటుందని చెప్పారు.

అయితే యూఏఈ నుంచి ఇండియాకు ప్యాసింజర్ ఫ్లైట్లను తాము నడుపుతామని ఎతిహాద్ ప్రకటించింది. సరకు రవాణా విమానాలు మాత్రం రెండు వైపులా ప్రయాణిస్తాయని చెప్పింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని తెలిపింది. ఈ నిషేధం తాత్కాలికమేనని చెప్పింది.


More Telugu News