శ్రీశైలం డ్యామ్ 10 గేట్లు ఎత్తివేత.. చూసేందుకు భారీగా వస్తున్న పర్యాటకులు

  • ఎగువన కురుస్తున్న వర్షాలతో పరవళ్లు తొక్కుతున్న కృష్ణానది
  • శ్రీశైలం జలాశయానికి 4,60,154 క్యూసెక్కుల ఇన్ ఫ్లో
  • 884 అడుగులకు చేరుకున్న నీటిమట్టం
ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణానది పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం జలాశయానికి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. జలాశయంలోకి 4,60,154 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉంది. పర్యవసానంగా, 10 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు.

దీంతో, డ్యామ్ నుంచి 3.40 లక్షల క్యూసెక్కుల నీరు శ్రీశైలం డ్యామ్ దిగువకు వెళ్తోంది. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా... ప్రస్తుతం 884 అడుగుల నీటిమట్టం ఉంది. శ్రీశైలం జలాశయం గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తుండటంతో... ఆ సుందర దృశ్యాన్ని చూసేందుకు పర్యాటకులు పెద్దఎత్తున అక్కడకు చేరుకుంటున్నారు.
 
డ్యామ్ పూర్తి స్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా... ప్రస్తుతం డ్యామ్ లో 212.4385 టీఎంసీల నీరు ఉంది. కుడి, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి సాగుతోంది. శ్రీశైలం నుంచి విడుదలవుతున్న నీరు నాగార్జునసాగర్ కు చేరుతోంది.


More Telugu News