రెండో టీ20లో భారత బ్యాట్స్ మెన్లు విఫలం... శ్రీలంక ముందు స్వల్ప లక్ష్యం

  • 5 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసిన ఇండియా
  • 40 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచిన ధావన్
  • రెండు వికెట్లు తీసిన ధనంజయ
శ్రీలంకతో జరుగుతున్న రెండో టీ20లో భారత బ్యాట్స్ మెన్లు ఆశించిన మేర రాణించలేకపోయారు. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 132 పరుగులకే టీమిండియా పరిమితమైంది. టాస్ గెలిచిన శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకుంది. పిచ్ బ్యాటింగ్ కు సహకరించకపోవడంతో మన బ్యాట్స్ మెన్ పరుగులు చేయడానికి తంటాలు పడ్డారు.

తొలి వికెట్ కు రుతురాజ్ గైక్వాడ్ (21), శిఖర్ ధావన్ (40) మంచి స్కోరును సాధించారు. ఇద్దరూ కలిసి 49 పరుగుల పార్ట్ నర్ షిప్ నెలకొల్పారు. ఆ తర్వాత దేవదత్ పడిక్కల్ 29 పరుగులు సాధించి పర్వాలేదనిపించాడు. మిగిలిన బ్యాట్స్ మెన్లలో సంజు శాంసన్ 7, నితీశ్ రాణా 9 పరుగులు చేయగా... భువనేశ్వర్ కుమార్ 13 పరుగులు, నవ్ దీప్ సైనీ 1 పరుగుతో నాటౌట్ గా నిలిచారు. శ్రీలంక బౌలర్లలో అకిల ధనంజయ రెండు వికెట్లు తీయగా... దుష్మంత చమీర, హసరంగ, శనక చెరో వికెట్ తీశారు.


More Telugu News