రెండో టీ20.. నిలకడగా ఆడుతున్న టీమిండియా
- టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న శ్రీలంక
- భారత్ స్కోరు.. 11 ఓవర్లకు 71 పరుగులు
- 35 పరుగులతో ఆడుతున్న ధావన్
కొలంబోలో భారత్, శ్రీలంకల మధ్య జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా నిలకడగా బ్యాటింగ్ చేస్తోంది. అంతకు ముందు టాస్ గెలిచిన శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత ఇన్నింగ్స్ ను రుతురాజ్ గైక్వాడ్, కెప్టెన్ శిఖర్ ధావన్ ప్రారంభించారు. వీరిద్దరూ కలిసి 7 ఓవర్లలో 49 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 21 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రుతురాజ్ ఔటయ్యాడు.
అనంతరం దేవదత్ పడిక్కల్ క్రీజులోకి వచ్చాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 11 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 71 పరుగులుగా ఉంది. ధావన్ 35 పరుగులతో, పడిక్కల్ 13 పరుగులతో ఆడుతున్నారు. శ్రీలంక జట్టులో శనక వికెట్ పడగొట్టాడు.
ఈ మ్యాచ్ ద్వారా భారత ఆటగాళ్లు దేవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, నితీశ్ రాణా, చేతన్ సకారియా అంతర్జాతీయ టీ20ల్లో అరంగేట్రం చేశారు. కృనాల్ పాండ్యాకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో నిన్న జరగాల్సిన మ్యాచ్ ఈరోజుకు వాయిదా పడిన సంగతి తెలిసిందే.