కావాలనే దారి మళ్లించి.. దాడి చేయించారు: పోలీసులపై ధూళిపాళ్ల ఆరోపణ

  • పక్కాప్లాన్ తోనే దేవినేనిపై దాడి
  • కేసు పెట్టనివ్వకుండా రివర్స్ కేసు
  • రక్షకులే భక్షకులుగా మారారని కామెంట్
దేవినేని ఉమామహేశ్వరరావుపై పోలీసులే పక్కా ప్లాన్ తో దాడి చేయించారని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. ముందస్తు సమాచారం ప్రకారమే, దాడి జరిగిన వైపు పోలీసులు కావాలనే దేవినేనిని దారి మళ్లించారని అన్నారు. దాడి జరుగుతుందని గ్రహించక పోలీసులు చెప్పిన దారిలోనే దేవినేని వెళ్లారన్నారు. బాధితుడైన దేవినేనిని కేసు పెట్టనివ్వకుండా, రివర్స్ లో ఆయనపైనే కేసు ఎలా పెడతారని పోలీసులపై ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో రక్షకులే భక్షకులుగా మారారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.


More Telugu News