'ఉప్పెన' దర్శకుడితో మోక్షజ్ఞ?

  • హాట్ టాపిక్ గా మోక్షజ్ఞ ఎంట్రీ
  • వచ్చే ఏడాదిలో ఖాయమే
  • పోటీ పడుతున్న దర్శకులు
  • తెరపైకి బుచ్చిబాబు పేరు
బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇచ్చే సమయం కోసం నందమూరి అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. ఫలానా దర్శకుడితో మోక్షజ్ఞ సినిమా చేయనున్నాడంటూ అడపా దడపా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే అవన్నీ కూడా ప్రచారంగానే మిగిలిపోయాయి. మళ్లీ ఇప్పుడు మోక్షజ్ఞ ఎంట్రీ విషయం తెరపైకి వచ్చింది.

'ఆదిత్య 369' సినిమా సీక్వెల్ ద్వారా మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందనే మాట ఇటీవల వినిపించింది. ఈ సినిమాలో బాలకృష్ణతో పాటు మోక్షజ్ఞ కనిపిస్తాడని చెప్పుకున్నారు. కానీ మోక్షజ్ఞ ఒక కొత్త కథ ద్వారా సోలోగానే తెలుగు తెరకి పరిచయం కానున్నాడనేది తాజాగా వినిపిస్తోన్న వార్త. మోక్షజ్ఞతో ఒక స్టార్ డైరెక్టర్ సినిమాను ప్లాన్ చేస్తున్నాడని అంటున్నారు.

అలాగే, మోక్షజ్ఞతో సినిమా చేయడానికి మైత్రీ మూవీ మేకర్స్ వారు కూడా రంగంలోకి దిగారని అంటున్నారు. 'ఉప్పెన' సినిమాతో తమకి భారీ హిట్ ఇచ్చిన బుచ్చిబాబు దర్శకత్వంలో ఈ సినిమా ఉండనుందని అంటున్నారు. ఆల్రెడీ ఈ నిర్మాతలు బాలకృష్ణను కలవడం జరిగిపోయిందని చెప్పుకుంటున్నారు. వచ్చే ఏడాదిలో మోక్షజ్ఞ పరిచయం కావడం ఖాయమని తెలుస్తోంది. ఇక ఏ దర్శకుడితో అనేదే తేలాల్సి ఉంది.


More Telugu News