టోక్యో ఒలింపిక్స్.. రెండో మ్యాచ్‌లోనూ విజయం సాధించిన పీవీ సింధు
- హాంకాంగ్ క్రీడాకారిణిని వరుస సెట్లలో ఓడించిన సింధు
- క్వార్టర్ ఫైనల్‌కు అర్హత
- రోయింగ్‌లో ఫైనల్ బికి అర్జున్‌లాల్, అర్వింద్ జంట
జపాన్ రాజధాని టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు వరుసగా రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. గ్రూప్-జెలో హాంకాంగ్ క్రీడాకారిణి చెయుంగ్ ఎన్‌గాన్ యితో జరిగిన పోరులో రియో రజతపతక విజేత సింధు 2-0తో విజయం సాధించింది. ఈ గెలుపుతో క్వార్టర్స్‌కు అర్హత సాధించి పతకంపై ఆశలు రేపింది. మరోవైపు, మహిళల హాకీలో భారత జట్టు మరో ఓటమిని మూటగట్టుకుంది. పూల్-ఎలో భాగంగా గ్రేట్ బ్రిటన్‌తో జరిగిన పోరులో 1-4 తేడాతో పరాజయం పాలైంది.
ఆర్చర్ తరుణ్‌దీప్ రాయ్ కూడా తీవ్రంగా నిరాశపరిచాడు. ఎలిమినేషన్స్ రౌండ్‌లో ఇజ్రాయెల్‌కు చెందిన షానీ చేతిలో 6-5 తేడాతో ఓటమి పాలయ్యాడు. లైట్‌వెయిట్ మెన్స్ డబుల్ స్కల్స్‌లో రోయింగ్ జంట అర్జున్‌లాల్ జాట్-అర్వింద్ సింగ్ జోడీ 6: 24.41 రేసును పూర్తిచేసి ఫైనల్ బికి చేరుకుంది.