కడప జిల్లాలో దారుణం.. వైసీపీ సర్పంచ్ హత్య

  • శిక్షణ తరగతులకు హాజరై వస్తున్న సమయంలో ఘటన
  • గ్రామ శివారులో కాపుకాసి నరికి చంపిన ప్రత్యర్థులు
  • ఆధిపత్య పోరులో భాగమేనంటున్న పోలీసులు
సర్పంచ్ శిక్షణ తరగతులకు వెళ్లి తిరిగి వస్తున్న ఓ సర్పంచ్‌ను ప్రత్యర్థులు దారుణంగా నరికి చంపారు. కడప జిల్లా లింగాల మండలం కోమనూతలలో జరిగిన ఈ ఘటన స్థానికంగా భయభ్రాంతులకు గురిచేసింది. వైసీపీకి చెందిన సర్పంచ్ మునెప్ప (50) శిక్షణ తరగతులకు హాజరై  బైక్‌పై వస్తున్న సమయంలో ఈ దారుణం జరిగింది.

గ్రామ శివారులో ఆయనను అడ్డుకున్న ప్రత్యర్థులు వేటకొడవళ్లతో దారుణంగా నరికి చంపారు. ఆధిపత్య పోరే ఈ హత్యకు కారణంగా పోలీసులు ప్రాథమికంగా ఓ నిర్ణయానికి వచ్చారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో మునెప్ప 150 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


More Telugu News