శ్రీశైలంలో విద్యుదుత్పత్తికి కృష్ణా బోర్డు అనుమతి: జెన్ కో చీఫ్ ఇంజినీర్

  • శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు
  • విద్యుదుత్పత్తికి అనుమతి ఇవ్వాలని బోర్డును కోరిన ఏపీ
  • సానుకూలంగా స్పందించిన కేఆర్ఎంబీ
  • ఒక యూనిట్ ద్వారా విద్యుదుత్పత్తి ప్రారంభం
శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా విద్యుదుత్పత్తికి కృష్ణా బోర్డు అనుమతి ఇచ్చిందని జెన్ కో చీఫ్ ఇంజినీర్ సుధీర్ కుమార్ వెల్లడించారు. కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి ప్రారంభించినట్టు తెలిపారు. ప్రస్తుతం కుడిగట్టు కేంద్రంలో ఒక యూనిట్ ద్వారా జల విద్యుదుత్పత్తి జరుగుతోందని వివరించారు.

శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వస్తోందని, జల విద్యుదుత్పత్తికి అనుమతి ఇవ్వాలంటూ నిన్న ఏపీ ఇంజినీర్ ఇన్ చీఫ్ నారాయణరెడ్డి కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు లేఖ రాశారు. ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, తుంగభద్ర ప్రాజెక్టులు నిండాయని, శ్రీశైలం వద్ద మిగులు జలాలతో విద్యుదుత్పత్తి చేస్తామని లేఖలో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన బోర్డు ఇవాళ అనుమతి మంజూరు చేసింది.


More Telugu News