జనసేన పార్టీ కార్యక్రమాల నిర్వహణ కోసం రాష్ట్ర కమిటీ ఏర్పాటు

  • జనసేనలో మరో కమిటీ నియామకం
  • కోఆర్డినేటర్ గా కల్యాణం శివ శ్రీనివాస్
  • 14 మందితో కమిటీ
  • కమిటీకి పవన్ కల్యాణ్ ఆమోద ముద్ర
జనసేన పార్టీ కార్యక్రమాల నిర్వహణ విభాగం రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేస్తూ ఆ పార్టీ హైకమాండ్ నేడు ప్రకటన విడుదల చేసింది. 14 మందితో కూడిన ఈ కమిటీకి జనసేనాని పవన్ కల్యాణ్ ఆమోద ముద్ర వేశారు. ఈ రాష్ట్ర కమిటీకి కల్యాణం శివ శ్రీనివాస్ ను ఇంతకుముందే సమన్వయకర్తగా నియమించారు. తాజాగా సంయుక్త కోఆర్డినేటర్లు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులను నియమించారు. చోడిశెట్టి చంద్రశేఖర సుబ్రహ్మణ్యం, సయ్యద్ విష్వక్సేన్ లను జాయింట్ కోఆర్డినేటర్లుగా నియమించారు.
కాగా, రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమాన్ని గాలికొదిలేశారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారని, వారి సంక్షేమం కోసం ఉద్దేశించిన బోర్డు నిధులను ఎటు మళ్లిస్తున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సంక్షేమ నిధి సాయం కోసం 2.3 లక్షల దరఖాస్తులు ఇప్పటిదాకా పెండింగ్ లో ఉన్నది వాస్తవం కాదా? అని నాదెండ్ల ప్రశ్నించారు.

ఈ ఉదయం ఏపీ భవన నిర్మాణ కార్మిక సంఘాల సంయుక్త కమిటీ నాదెండ్లను కలిసింది. వచ్చే నెల 5న విజయవాడలో తలపెట్టే ధర్నాకు జనసేన పార్టీ మద్దతు ఇవ్వాలని కమిటీ ప్రతినిధులు నాదెండ్లను కోరారు. జనసేన ఎప్పుడూ కష్టజీవులకు అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.


More Telugu News