గ్రేటర్ విశాఖ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైసీపీ విజయం

  • నేడు జీవీఎంసీ స్టాండింగ్ కమిటీకి ఎన్నికలు
  • మధ్యాహ్నం 2 గంటల వరకు ఓటింగ్
  • ఆపై ఓట్ల లెక్కింపు
  • విజయం సాధించిన వైసీపీ కార్పొరేటర్లు
గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లోనూ వైసీపీ ఆధిపత్యం కొనసాగింది. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఓటింగ్ నిర్వహించగా, అనంతరం ఓట్ల లెక్కింపు నిర్వహించారు. 10 మంది వైసీపీ కార్పొరేటర్లు ఈ ఎన్నికల్లో విజయం అందుకున్నారు. మొత్తం 67 మంది కార్పొరేటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అందులో 57 మంది వైసీపీకి చెందిన వారే కావడంతో ఆ పార్టీకి విజయం నల్లేరుపై నడకే అయింది.

ఓ నగరపాలక సంస్థకు స్టాండింగ్ కమిటీ ఎంతో కీలకమైనది. దీనికి మేయర్ నాయకత్వం వహిస్తారు. ఇందులో 10 మంది డైరెక్టర్లుగా కొనసాగుతారు. తాజా ఎన్నికల ద్వారా జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో అందరూ వైసీపీ కార్పొరేటర్లే గెలిచారు. కాగా, ఈ విజయంపై మంత్రి అవంతి శ్రీనివాసరావు, పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు హర్షం వెలిబుచ్చారు. పరిషత్ ఎన్నికల్లోనూ వైసీపీదే విజయం అని ధీమా వ్యక్తం చేశారు.


More Telugu News