చైనా రహస్య అణు స్థావరాన్ని గుర్తించిన అమెరికా పరిశోధకుడు
- కొన్నివారాల కిందట యుమెన్ లో ఓ స్థావరం గుర్తింపు
- తాజాగా హమి వద్ద మరో స్థావరం గుర్తింపు
- ప్రపంచ అణుశక్తిగా ఎదిగేందుకు చైనా యత్నాలు
- నిపుణుల అంచనా
ప్రపంచ అణుశక్తిగా ఎదిగేందుకు చైనా రహస్యంగా చేస్తున్న ప్రయత్నాలను అమెరికాకు చెందిన ఓ పరిశోధకుడు బట్టబయలు చేశాడు. తూర్పు జిన్ జియాంగ్ ప్రావిన్స్ లోని హమి ప్రాంతంలో ఈ చైనా అణ్వస్త్ర క్షేత్రం ఉందని మాట్ కోర్డా అనే ఈ పరిశోధకుడు వెల్లడించాడు. ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్ (ఎఫ్ఎస్ఏ)కు చెందిన న్యూక్లియర్ ఇన్ఫర్మేషన్ ప్రాజెక్టులో మాట్ కోర్డా రీసెర్చ్ అసోసియేట్ గా పనిచేస్తున్నాడు.
తాజాగా చేసిన ఓ ప్రకటనలో చైనాలోని రెండో భారీ అణు క్షిపణుల కేంద్రాన్ని గుర్తించినట్టు తెలిపాడు. కొన్ని ఉపగ్రహ ఛాయాచిత్రాలను విశ్లేషించడం ద్వారా ఈ అంశం వెల్లడైందని వివరించాడు. కాగా కొన్ని వారాల కిందటే చైనాలోని యుమెన్ ప్రాంతంలో ఇదే సైజులో ఉన్న అణ్వస్త్ర క్షేత్రాన్ని గుర్తించాడు.
ఇతర అంతర్జాతీయ అణు నిపుణులు కూడా చైనా అణుశక్తి విస్తరణను నిర్ధారించారు. అమెరికా, రష్యాలకు దీటుగా అణ్వాయుధాల సంఖ్యను ఇబ్బడిముబ్బడిగా పెంచుకోవడంతో పాటు, వేగంగా ఆయుధ పాటవాన్ని పెంచుకుంటున్న భారత్ కు సవాల్ విసిరేందుకు చైనా ఈ చర్యలకు పాల్పడుతోందని అభిప్రాయపడుతున్నారు.