టోక్యో ఒలింపిక్స్ బాక్సింగ్: పతకానికి అడుగు దూరంలో భారత్
- జర్మనీ బాక్సర్ ను మట్టికరిపించిన లవ్లీనా
- వెల్టర్ వెయిట్ విభాగంలో క్వార్టర్స్ లోకి
- 30న ప్రపంచ ర్యాంకర్ తో పోటీ
టోక్యో ఒలింపిక్స్ బాక్సింగ్ ఈవెంట్ లో మరో ఈశాన్య రాష్ట్రపు అమ్మాయి అదరగొట్టింది. పతకం పంచ్ కు మరో అడుగు దూరంలో నిలిచింది. ఇవ్వాళ జరిగిన బౌట్ లో మహిళల వెల్టర్ వెయిట్ (తక్కువ బరువు కన్నా ఎక్కువ.. మధ్యస్థం కన్నా తక్కువ) విభాగం (64 నుంచి 69 కిలోలు)లో బరిలోకి దిగిన 23 ఏళ్ల లవ్లీనా బోర్గోహెయిన్.. ఎంతో అనుభవం ఉన్న జర్మనీ బాక్సర్ నదీన్ ఆప్టెజ్ ను మట్టి కరిపించింది.
ఈ విజయంతో ఆమె క్వార్టర్ ఫైనల్స్ లోకి దూసుకెళ్లింది. 3 రౌండ్లలోనూ ఆమె ఆధిపత్యం ప్రదర్శించింది. అయితే, ఐదుగురు న్యాయ నిర్ణేతల్లో ముగ్గురు.. లవ్లీనాకు అధిక పాయింట్లు వేశారు. మరో ఇద్దరు జడ్జిలు ఆప్టెజ్ వైపు ఉన్నారు. దీంతో 3:2 తేడాతో ఆప్టెజ్ పై లవ్లీనా విజయం సాధించింది. క్వార్టర్స్ లో గెలిచి సెమీస్ కు వెళితే ఆమెకు పతకం వచ్చే అవకాశాలు ఉన్నాయి.
జులై 30న జరిగే క్వార్టర్స్ లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ చెన్ నియెన్ చిన్ ను లవ్లీనా ఎదుర్కోనుంది. కాగా, అసోం నుంచి ఒలింపిక్స్ కు వెళ్లిన తొలి బాక్సర్ గా లవ్లీనా చరిత్ర సృష్టించింది. ఆమెకు మద్దతుగా ఇటీవల ఆ రాష్ట్ర అధికార, ప్రతిపక్షాలు కలిసి సైకిల్ ర్యాలీ నిర్వహించిన సంగతి తెలిసిందే.