'రాజ రాజ చోర' నుంచి వస్తున్న టైటిల్ సాంగ్!

  • 'రాజ రాజ చోర'గా శ్రీవిష్ణు
  • దర్శకుడిగా హసిత్ గోలీ పరిచయం
  • కీలక పాత్రలో రవిబాబు
  • త్వరలోనే విడుదల    
శ్రీవిష్ణు తన పరిధిలోనే కొత్త కథలను ఎంచుకోవడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూ వస్తున్నాడు. అలాగే ఈ సారి కూడా ఆయన అదే పద్ధతిని అనుసరించాడు. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'రాజ రాజ చోర' సిద్ధమవుతోంది. ఈ సినిమా నుంచి ఇంతవరకూ వచ్చిన ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇక రేపు ఈ సినిమా నుంచి 'రాజరాజు వచ్చే' అనే టైటిల్ సాంగ్ ను వదలనున్నారు. అందుకు ముహూర్తాన్ని కూడా ఖరారు చేశారు. రేపు (బుధవారం, 28వ తేదీ)  సాయంత్రం 4:05 గంటలకు ఈ సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు.

హసిత్ గోలి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు, విశ్వప్రసాద్ - అభిషేక్ అగర్వాల్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. శ్రీవిష్ణు సరసన నాయికగా మేఘ ఆకాశ్ నటించగా, ముఖ్య పాత్రల్లో రవిబాబు .. తనికెళ్ల భరణి .. గంగవ్వ కనిపించనున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా, త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. 



More Telugu News