అలాంటి సినిమాల్లో నటించేందుకు అగ్ర హీరోలు ఒప్పుకోరు: తాప్సి
- హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించడం కష్టం
- మహిళా ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో నటించేందుకు హీరోలు ఒప్పుకోరు
- అగ్ర హీరోలు మైండ్ సెట్ మార్చుకోవాలి
హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించి, ప్రేక్షకులను మెప్పించడం చాలా కష్టమని హీరోయిన్ తాప్సి చెప్పింది. మహిళా ప్రాధాన్యత ఉన్న కథాంశాలతో తెరకెక్కించే సినిమాలను జనాలకు చేరువ చేయడంలో చాలా కష్టాలు ఉంటాయని తెలిపింది. ముఖ్యంగా ఇలాంటి సినిమాల్లో నటించేందుకు టాప్ హీరోలు ఒప్పుకోరని... వారి పాత్ర నిడివి తక్కువగా ఉంటుందని వారు భావిస్తుంటారని చెప్పింది.
కథ మొత్తం హీరోయిన్ చుట్టూ తిరుగుతుంది కాబట్టి... వారి హీరో ఇమేజ్ తగ్గిపోతుందని భయపడతారని తెలిపింది. అదే హీరోయిన్లు అయితే కథలో కీలకంగా ఉండే చిన్న పాత్రనైనా ఒప్పుకుంటారని చెప్పింది. ఈ విషయంలో అగ్ర హీరోలు వారి మైండ్ సెట్ మార్చుకోవాలని తాప్సి హితవు పలికింది.
హీరో, హీరోయిన్లు ఇమేజ్ పట్టింపులను వదిలేసి సమన్వయంతో పని చేస్తే ఎన్నో మంచి చిత్రాలు వస్తాయని తెలిపింది. అప్పుడే సినీ పరిశ్రమలో మహిళా సాధికారత సాధ్యమవుతుందని చెప్పింది. ప్రస్తుతం తాప్పి చాలా బిజీగా ఉంది. బాలీవుడ్ తో పాటు తెలుగు, తమిళంలో తొమ్మిది చిత్రాల్లో నటిస్తోంది.