విశాఖ జిల్లాలో విషాదం.. పెద్దేరు వాగులో పడిన నలుగురు చిన్నారుల మృతి

  • జిల్లాలోని వి.మాడుగుల మండలం జాలంపిల్లిలో ఘటన
  • పెద్దలతోపాటు వాగుకు చిన్నారులు
  • ఊబిలో చిక్కుకుని మృత్యువాత
విశాఖపట్టణంలో జిల్లా వి.మాడుగుల మండలం జాలంపిల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఇక్కడ పెద్దేరు వాగులో పడి నలుగురు చిన్నారులు మృతి చెందారు. మృతులంతా 11 ఏళ్ల లోపువారే కావడం గమనార్హం. బట్టలు ఉతికేందుకు వాగువద్దకు వెళ్లిన పెద్దలతోపాటు వెళ్లిన చిన్నారులు ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు రేవులోని ఊబిలో చిక్కుకుపోయారు.

విషయం తెలిసిన వెంటనే గ్రామస్థులు ఘటనా స్థలానికి వెళ్లి పిల్లల కోసం గాలించారు. అయితే, అప్పటికే వారంతా మరణించడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతి చెందిన వారిలో గ్రామానికి చెందిన నీలాపు మహేందర్ (7), వెంకట ఝాన్సీ (10), షర్మిల (7), ఝాహ్నవి (11) ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


More Telugu News