వలసదారులతో వెళుతున్న పడవ బోల్తా.. లిబియాలో 57 మంది దుర్మరణం

  • దుర్ఘటన సమయంలో పడవలో 57 మంది
  • మృతుల్లో 20 మంది మహిళలు, ఇద్దరు చిన్నారులు
  • మెరుగైన జీవనం కోసం ఐరోపాకు వలస వెళ్తుండగా ఘటన
లిబియాలో వలసదారులతో వెళుతున్న పడవ సముద్రంలో బోల్తా పడడంతో 57 మంది జలసమాధి అయ్యారు.  ప్రమాద సమయంలో పడవలో 75 మంది వరకు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. మృతుల్లో 20 మంది మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. వీరందరూ మధ్యదరా సముద్రం మీదుగా మరింత మెరుగైన జీవనం కోసం ఐరోపాకు వెళ్తుండగా పడవ ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తి సముద్రంలో నిలిచిపోయింది.ఆ తర్వాత ప్రతికూల పరిస్థితులు ఏర్పడడంతో ఒక్కసారిగా మునిగిపోయింది.

ఈ దుర్ఘటనలో 57 మంది చనిపోయినట్టు భావిస్తున్నట్టు యూఎస్ మైగ్రేషన్ అధికారి ఒకరు తెలిపారు. పశ్చిమ తీర పట్టణమైన ఖుమ్స్ నుంచి పడవ నిన్న బయలుదేరినట్టు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ ప్రతినిధి సఫా మెహ్లీ పేర్కొన్నారు. మృతుల్లో నైజీరియా, ఘనా, గాంబియా తదితర దేశాలకు చెందినవారు ఉన్నట్టు సమాచారం.


More Telugu News