తెలంగాణలో మరో 638 కరోనా పాజిటివ్ కేసులు
- గత 24 గంటల్లో 1,14,105 కరోనా పరీక్షలు
- వరంగల్ అర్బన్ జిల్లాలో 66 కేసులు
- రాష్ట్రంలో ముగ్గురి మృతి
- ఇంకా 9,325 మందికి చికిత్స
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 1,14,105 కరోనా పరీక్షలు నిర్వహించగా, 638 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వరంగల్ అర్బన్ జిల్లాలో అత్యధికంగా 66 కొత్త కేసులు వెల్లడయ్యాయి. కరీంనగర్ జిల్లాలో 65, ఖమ్మం జిల్లాలో 62, గ్రేటర్ హైదరాబాదులో 59 కేసులు గుర్తించారు. నారాయణపేట జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.
అదే సమయంలో 715 మంది కరోనా నుంచి కోలుకోగా, ముగ్గురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,41,791 పాజిటివ్ కేసులు నమోదు కాగా.... 6,28,679 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 9,325 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మరణాల సంఖ్య 3,787కి పెరిగింది.