అభియోగాల నమోదుపై వాదనలకు సిద్ధంకండి: జగన్ తదితరులకు సీబీఐ కోర్టు ఆదేశం

  • సీబీఐ-ఈడీ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసు విచారణ
  • కీలక దశకు చేరిన విచారణ
  • తదుపరి విచారణ ఆగస్టు 3కి వాయిదా
వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ కోర్టులో విచారణ కీలక దశకు చేరుకుంది. అభియోగాల నమోదుపై వాదనలకు సిద్ధంగా ఉండాలని జగన్, విజయసాయిరెడ్డి, ధర్మాన ప్రసాదరావు, అరబిందో ఫార్మా ఎండీ నిత్యానందరెడ్డి, ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ ఎండీ శరత్ చంద్రారెడ్డి, గీతారెడ్డి, మురళీధర్ రెడ్డి, శామ్యూల్, బీపీ ఆచార్య, వైవీ సుబ్బారెడ్డి, ఇందూ శ్యాంప్రసాద్ రెడ్డి, వీవీ కృష్ణప్రసాద్ తదితరులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

 జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి నేడు సీబీఐ-ఈడీ న్యాయస్థానం విచారణ కొనసాగించింది. జగన్ తదితర నిందితులకు ఆదేశాలు జారీ చేసిన అనంతరం విచారణను వచ్చే నెల 3కి వాయిదా వేస్తున్నట్టు తెలిపింది.

అటు, ఈడీ కేసులను ముందు విచారించడాన్ని సవాల్ చేస్తూ విజయసాయిరెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడం తెలిసిందే. ఆయన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు తీర్పును రిజర్వ్ లో ఉంచింది. హైకోర్టు తీర్పు ఏమిటన్నది ఆసక్తి కలిగిస్తోంది.


More Telugu News