ఎన్టీఆర్ చేతుల మీదుగా 'తిమ్మరుసు' ట్రైలర్ రిలీజ్!

  • లాయర్ పాత్రలో సత్యదేవ్
  • ఆసక్తిని రేకెత్తిస్తున్న ట్రైలర్
  • సినిమాపై పెరుగుతున్న అంచనాలు
  • ఈ నెల 30వ తేదీన విడుదల
సత్యదేవ్ కథానాయకుడిగా శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో 'తిమ్మరుసు' సినిమా రూపొందింది. కోనేరు సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమాను, ఈ నెల 30వ తేదీన థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ వదిలారు. కొంతసేపటి క్రితం ఎన్టీఆర్ చేతుల మీదుగా ట్రైలర్ ను రిలీజ్ చేయించారు.

లాయర్ రామచంద్రగా సత్యదేవ్ పాత్రను హైలైట్ చేస్తూ ఈ ట్రైలర్ కొనసాగింది. కేసును గెలిపించడం కోసం అవసరమైతే తన డబ్బును ఖర్చు చేసే నిజాయతీ పరుడిగా ఆయన పాత్రను చూపించారు. అలా అందరికీ సాయం చేస్తూ, కారు నుంచి బైక్ రేంజ్ కి పడిపోయిన తీరును గురించి చెప్పారు. ఈ కథ అంతా కూడా ఒక మర్డర్ కేసు చుట్టూ తిరుగుతుంది.

"నీ ముందున్నది 'వాలి' అని మరిచిపోకు లాయర్ రామచంద్ర .. ఎదురుగా వస్తే సగం బలం లాగేస్తా" అని క్రిమినల్ అంటే, "నువ్వు సగం బలం లాగే వాలివైతే, దండేసి దండించే రాముడి లాంటివాడిని నేను" అని హీరో చెప్పే డైలాగ్ హైలైట్ గా అనిపిస్తోంది. ట్రైలర్ ను చూస్తుంటే సినిమాపై అంచనాలు పెంచేదిలానే ఉంది.



More Telugu News