యడియూరప్ప రాజీనామాకు గవర్నర్ ఆమోదం
- కర్ణాటకలో రాజకీయ సంక్షోభం
- సీఎం పదవికి రాజీనామా చేసిన యడియూరప్ప
- ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలన్న గవర్నర్
- తదుపరి సీఎం ఎవరన్నదానిపై నెలకొన్న ఆసక్తి
కర్ణాటకలో అనూహ్య రాజకీయ సంక్షోభం నెలకొంది. సీఎం యడియూరప్ప ఇవాళ తన పదవికి రాజీనామా చేశారు. కాగా, యడియూరప్ప రాజీనామాను గవర్నర్ తవర్ చంద్ గెహ్లాట్ ఆమోదించారు. ప్రస్తుతానికి ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని యడియూరప్పను గవర్నర్ కోరారు.
కాగా, నిన్న బీజేపీ జాతీయ చీఫ్ జేపీ నడ్డా ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎక్కడా కూడా యడియూరప్పపై వ్యతిరేకత వ్యక్తం చేయలేదు. పైగా, యడ్డి పాలన బాగానే ఉందంటూ కితాబునిచ్చారు. కానీ, పార్టీ అంతర్గత ఆదేశాల మేరకే యడ్డి సీఎం పదవి నుంచి తప్పుకుంటున్నట్టు అర్థమవుతోంది. ఇక, కర్ణాటక తదుపరి సీఎం ఎవరన్నదానిపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఈ సాయంత్రం గానీ, రేపు గానీ బీజేపీ అధిష్ఠానం నుంచి దీనిపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది.