పోర్నోగ్రఫీ కేసు.. రాజ్ కుంద్రా బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేసిన క్రైమ్ బ్రాంచ్

  • కాన్పూర్ ఎస్బీఐలో రెండు అకౌంట్లు సీజ్
  • అర్వింద్ శ్రీవాస్తవ భార్య ఖాతాకు నగదు బదిలీలు
  • కుంద్రాకు వ్యతిరేకంగా సాక్ష్యమిచ్చేందుకు సిద్ధమైన నలుగురు ఉద్యోగులు
పోర్నోగ్రఫీ కేసులో విచారణను ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాకు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు షాకిచ్చారు. కాన్పూర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్న రెండు బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేశారు. ఈ రెండు బ్యాంకు ఖాతాల్లో కోట్లాది రూపాయలు జమ అయ్యాయని నిర్ధారణకు వచ్చిన అధికారులు రెండు అకౌంట్లను సీజ్ చేశారు.

ఈ సందర్భంగా మరో విషయం వెలుగులోకి వచ్చింది. రాజ్ కుంద్రాకు చెందిన ప్రొడక్షన్ కంపెనీని అర్వింద్ శ్రీవాస్తవ నిర్వహించేవాడని... ఈ క్రమంలో అర్వింద్ భార్య హర్షిత ఖాతాకు డబ్బులు ట్రాన్స్ ఫర్ అయ్యేవని అధికారులు గుర్తించారు.

మరోవైపు ఏఎన్ఐతో అర్వింద్ తండ్రి ఎన్పీ శ్రీవాస్తవ మాట్లాడుతూ, గత రెండేళ్ల నుంచి అర్వింద్ ఇంటికి రాలేదని... అయితే ఇంటి ఖర్చుల కోసం ఎప్పటికప్పుడు డబ్బులు పంపేవాడని చెప్పారు. 2021లో అర్వింద్ కు క్రైమ్ బ్రాంబ్ లుకౌట్ నోటీసులు జారీ చేసిందని తెలిపారు. అయితే అర్వింద్ ఏం పని చేస్తున్నాడనే విషయం మాత్రం తనకు తెలియదని అన్నారు. హర్షిత బ్యాంక్ ఖాతాకు డబ్బు బదిలీ అవుతున్న సంగతి కూడా తనకు తెలియదని చెప్పారు. పోర్నోగ్రఫీ కేసులో రాజ్ కుంద్రాకు వ్యతిరేకంగా ఆయన వద్ద పని చేస్తున్న నలుగురు ఉద్యోగులు సాక్ష్యం ఇచ్చేందుకు సిద్ధమైన మరుసటి రోజే ఆయన బ్యాంకు ఖాతాలు సీజ్ కావడం గమనార్హం.

ఈ నెల 19న రాజ్ కుంద్రాతో పాటు మరో 11 మందిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. రేపటి వరకు కుంద్రాకు పోలీసు కస్టడీని కోర్టు విధించింది. మరోవైపు ఇదే కేసులో టీవీ నటి, మోడల్ గెహనా వశిష్ట్ కు పోలీసులు నిన్న సమన్లు పంపించారు.


More Telugu News