ఇప్పుడైనా మేల్కోండి సీఎం సారు: వైఎస్ ష‌ర్మిల‌

  • అకాల వర్షాలకు 5 లక్షల ఎకరాలలో పంట న‌ష్టం
  • ఫసల్ బీమా యోజన పథకం నుంచి రాష్ట్ర ప్ర‌భుత్వం తప్పుకుంది
  • సొంత పంటల బీమా పాలసీని తీసుకొస్తామ‌ని చెప్పింది
  • గొప్పగా చెప్పినప్ప‌టికీ ఇంతవరకు తీసుకురాలేదు
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై వైఎస్ ష‌ర్మిల తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. తెలంగాణ‌లో వ‌ర్షాల‌కు పంటలు పెద్ద ఎత్తున దెబ్బ‌తిన్నాయ‌ని, బీమా సౌక‌ర్యం లేక‌పోవ‌డంతో రైతులు తీవ్రంగా న‌ష్ట‌పోయార‌ని అంటూ వ‌చ్చిన ఓ వార్త‌ను ఆమె పోస్ట్ చేశారు. రైతులు ఎన్నో క‌ష్టాలు ప‌డుతున్నార‌ని, ఇప్ప‌టిక‌యినా మేల్కోవాల‌ని ఆమె కోరారు.

'అవ్వ పెట్టదు.. అడక్కు తిననీయదు అన్నట్టే ఉంది కేసీఆర్ దొర తీరు.. రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలకు 5 లక్షల ఎకరాలలో పంటలను నష్టపోయారు రైతులు. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకం నుంచి గత సంవత్సరం తప్పుకున్న రాష్ట్ర ప్రభుత్వం... సొంత పంటల బీమా పాలసీని తీసుకొస్తాం అని గొప్పగా చెప్పినప్ప‌టికీ ఇంతవరకు తీసుకురాలేదు. దీంతో రైతులకు అటు కేంద్రం బీమా వర్తించక.. ఇటు రాష్ట్ర బీమా దిక్కులేక కష్టాలు పడుతున్నారు.. రైతు నష్టాల పాలవుతున్నడు. ఇప్పుడైనా మేల్కోండి సీఎం సారు' అని  ష‌ర్మిల ట్వీట్ చేశారు.


More Telugu News