సీనియ‌ర్ సినీ న‌టి జ‌యంతి ఇక‌లేరు!

  • అనారోగ్యంతో త‌న నివాసంలో క‌న్నుమూత‌
  • యడియూరప్ప స‌హా ప్ర‌ముఖుల‌ సంతాపం
  • దాదాపు 500 సినిమాల్లో న‌టించిన జ‌యంతి
అనారోగ్యంతో సీనియ‌ర్ సినీ నటి జయంతి బెంగ‌ళూరులోని త‌న నివాసంలో (76) కన్నుమూశారు. గత కొన్నేళ్లుగా ఆమె అనారోగ్య సమస్యలతో బాధ‌పడుతున్నట్లు తెలుస్తోంది. జయంతి మరణం ప‌ట్ల పట్ల కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప సహా పలువురు రాజ‌కీయ‌, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆమెతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు.

జ‌యంతి సొంత ప్రాంతం కర్ణాటకలోని బళ్లారి. ఆమె 1963లో క‌న్నడ సినిమా ‘జెనుగూడు’తో నటిగా సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టారు. ద‌క్షిణాది భాష‌ల‌లో పాటు హిందీ సినిమాల్లోనూ ఆమె న‌టించారు. దాదాపు 500కు పైగా సినిమాల్లో ఆమె నటించారు.

ఎన్టీఆర్, ఎంజీఆర్, రజనీకాంత్‌, రాజ్‌కుమార్‌ వంటి హీరోల సినిమాల్లోనూ న‌టించారు. మోహన్ బాబు నటించిన పెదరాయుడు సినిమాలో ఆమె నటనకు తెలుగులో  మంచి గుర్తింపు వచ్చింది. జగదేక వీరుడి కథ, డాక్టర్ చక్రవర్తి, కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి, దొంగ మొగుడు, కొదమ సింహం వంటి తెలుగు సినిమాల్లోనూ న‌టించారు.


More Telugu News