టిబెట్ పీఠభూమిలో వేల ఏళ్లనాటి వైరస్‌లను గుర్తించిన శాస్త్రవేత్తలు

  • 15 వేల ఏళ్లనాటివిగా గుర్తింపు 
  • ఘనీభవించి ఉండడంతో ఇంతకాలం మనుగడ
  •  ప్రతికూల పరిస్థితుల్లోనూ మనుగడ సాగించేలా పరివర్తన
  • మానవులకు హాని లేదన్న పరిశోధకులు
టిబెట్ పీఠభూమిలోని హిమానీనదిలోని మంచు నమూనాల్లో 15 వేల ఏళ్లనాటి పురాతన వైరస్‌లను శాస్త్రవేత్తలు గుర్తించారు. పశ్చిమ చైనాలోని 22 వేల అడుగుల ఎత్తులోని గులియా మంచు పర్వతం నుంచి శాస్త్రవేత్తలు ఈ నమూనాలను సేకరించారు. శిఖరాగ్రం నుంచి 1,017 అడుగుల లోతులో వీటిని తీసుకుని పరిశోధన నిర్వహించి 33 రకాల వైరస్‌లను గుర్తించారు. వీటిలో 28 రకాల వైరస్‌ల గురించి ఇప్పటి వరకు మనుషులకు అసలు తెలియకపోవడం గమనార్హం.

 వైరస్‌లు ఘనీభవించి ఉండడం వల్లే అవి ఇన్ని వేల సంవత్సరాలపాటు భద్రంగా ఉన్నట్టు పరిశోధకులు తెలిపారు. ఇవి జంతువుల నుంచి కాకుండా మట్టి  లేదంటే మొక్కల నుంచి వచ్చి ఉంటాయని భావిస్తున్నారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ మనుగడ సాగించేందుకు అవసరమైన పరివర్తన వీటిలో జరిగిందన్నారు. అలాగే, ఈ వైరస్‌ల వల్ల మానవులకు ఎలాంటి హానీ ఉండబోదని ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన లోనీ థాంప్సన్ తెలిపారు.


More Telugu News