కుటుంబ సమేతంగా బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న డీఆర్డీఓ చైర్మన్ సతీష్ రెడ్డి

  • విజయవాడ వచ్చిన డీఆర్డీఓ చైర్మన్
  • ఇంద్రకీలాద్రిపై పూర్ణకుంభ స్వాగతం
  • ప్రత్యేక పూజలు నిర్వహించిన సతీష్ రెడ్డి
  • అమ్మవారి చిత్రపటం బహూకరించిన ఆలయవర్గాలు
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ) చైర్మన్ సతీశ్ రెడ్డి ఇవాళ విజయవాడ విచ్చేశారు. ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గ అమ్మవారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఈ ఉదయం ఆలయానికి విచ్చేసిన సతీష్ రెడ్డి కుటుంబానికి దుర్గ గుడి వర్గాలు పూర్ణకుంభ స్వాగతం పలికాయి. ఆలయ సందర్శన సందర్భంగా సతీష్ రెడ్డి కుటుంబం ప్రత్యేక పూజలు నిర్వహించింది. వేదపండితులు వారికి ఆశీస్సులు అందజేశారు. ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు.

విజయవాడ వచ్చిన సందర్భంగా సతీష్ రెడ్డి కృష్ణా జిల్లా రైటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలోనూ పాల్గొన్నారు.

దేశ రక్షణ రంగ పాటవాన్ని మరింత ఇనుమడింప చేస్తున్న సంస్థ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ). చైర్మన్ గా తెలుగువాడైన జి. సతీష్ రెడ్డి బాధ్యతలు అందుకున్నాక వరుసగా ఆయుధ పరీక్షలు నిర్వహిస్తూ, అస్త్రాలకు మరింత పదునుపెడుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ఆత్మనిర్భర్ కు అనుగుణంగా అనేక ఆయుధాలను అభివృద్ధి చేస్తున్న డీఆర్డీఓ స్వావలంబన దిశగా ముందుడుగు వేస్తోంది.


More Telugu News