ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం

  • మార్చి 10న ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలు
  • హైకోర్టు ఆదేశాలతో కౌంటింగ్ ఆలస్యం
  • గతంలో 3 డివిజన్లు ఏకగ్రీవం
  • 47 డివిజన్లకు నేడు ఓట్ల లెక్కింపు
  • 42 డివిజన్ల ఫలితాలు వెల్లడి
  • 39 డివిజన్లలో వైసీపీ జయభేరి
ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార వైసీపీ స్పష్టమైన ఆధిక్యంతో దూసుకుపోతోంది. మొత్తం 50 డివిజన్లు ఉండగా, 3 డివిజన్లు వైసీపీకి ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 47 డివిజన్లకు మార్చి 10న ఎన్నికలు నిర్వహించగా, హైకోర్టు ఆదేశాలతో కౌంటింగ్ ఆలస్యం అయింది. ఈ నేపథ్యంలో ఇవాళ ఓట్ల లెక్కింపు చేపట్టగా, అధికార వైసీపీకి విపక్షాలు దరిదాపుల్లో కూడా లేవు. 47 డివిజన్లకు గాను 42 డివిజన్లలో ఫలితాలు వెల్లడయ్యాయి. వైసీపీ 39 డివిజన్లలో విజయభేరి మోగించగా, టీడీపీకి 3 డివిజన్లు దక్కాయి. జనసేన కనీసం ఉనికి చాటుకోలేకపోయింది.


More Telugu News