18 ఏళ్లకే వృద్ధాప్య లక్షణాలతో మృతి... యూకే అమ్మాయి విషాదాంతం!

  • రెండు కోట్ల మందిలో ఒకరిలో కనిపించే సిండ్రోమ్
  • ఏడాదికి 8 రెట్లు వయసు మళ్లిన లక్షణాలు
  • బ్రిటన్ లోని అషాంటీ స్మిత్ లోనూ సిండ్రోమ్ లక్షణాలు
  • 8వ ఏట గుర్తింపు
హచిసన్-గిల్ ఫోర్డ్ ప్రొగేరియా... ఇది ఒక అరుదైన సిండ్రోమ్. రెండు కోట్లమందిలో ఏ ఒక్కరిలోనో కనిపించే జన్యు సంబంధ లోపం. ఈ సిండ్రోమ్ తో బాధపడేవారు వయసుకు మించి పెద్దవారిలా కనిపిస్తారు. టీనేజ్ లోనే వృద్ధాప్యం వచ్చేస్తుంది. బ్రిటన్ కు చెందిన అషాంటీ స్మిత్ అనే అమ్మాయి కూడా ఈ హచిసన్-గిల్ ఫోర్డ్ ప్రొగేరియా సిండ్రోమ్ తో బాధపడుతూ ఈ లోకాన్ని విడిచింది.

అషాంటీ 8వ ఏట ఈ సిండ్రోమ్ తో బాధపడుతున్నట్టు గుర్తించారు. ఏడాదికి 8 రెట్లు వయసు మళ్లిన లక్షణాలు కనిపించేవి. అయితే, అషాంటీ 18 ఏళ్ల వయసులో అందరినీ విషాదంలో ముంచెత్తుతూ కన్నుమూసింది. అప్పటికే తీవ్ర వృద్ధాప్య లక్షణాలు ఆమెను చుట్టుముట్టాయి.

కాగా, తాను చనిపోయేంత వరకు తనలోని విషాదాన్ని మౌనంగా భరిస్తూ, అందరినీ నవ్వించేది. పైగా, తాను త్వరలోనే చనిపోతానని తెలిసి కూడా ఆమె ముఖంపై నవ్వు చెరగలేనదని తల్లి లూయిస్ స్మిత్ వెల్లడించింది. ఆమె బీటీఎస్ సంగీతానికి అభిమాని అని, ఆమె అంత్యక్రియల్లో బీటీఎస్ సంగీతం వినిపిస్తామని పేర్కొంది. తమ కుమార్తె జ్ఞాపకార్థం హచిసన్-గిల్ ఫోర్డ్ ప్రొగేరియా సిండ్రోమ్ తో బాధపడే వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడతామని లూయిస్ స్మిత్ వివరించింది.


More Telugu News