22 కోట్ల జనాభా ఉండి.. ఒలింపిక్స్ లో పది మంది ఆటగాళ్లేనా?: పాక్ మాజీ క్రికెటర్ అసహనం
- దేశంలో క్రీడల పరిస్థితిపై ఇమ్రాన్ నాజిర్ ఆవేదన
- దిగజారడానికి కారణమైనవారు సిగ్గుపడాలి
- దూరదృష్టి లేకపోవడం వల్లే ఈ దుస్థితి
పాకిస్థాన్ లో క్రీడల పరిస్థితిపై మాజీ క్రికెటర్ ఇమ్రాన్ నాజిర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. 22 కోట్ల జనాభా ఉన్న దేశం నుంచి ఒలింపిక్స్ లో పాల్గొనేది 10 మంది ఆటగాళ్లేనా అని ప్రశ్నించాడు. క్రీడల్లో పాకిస్థాన్ ఇంతలా దిగజారడానికి కారణమైన వారు దీనికి సిగ్గుపడాలంటూ మండిపడ్డాడు.
దేశంలో ప్రతిభకు కొదవ లేదని, క్రీడలను అభివృద్ధి చేయాలన్న సంకల్పం, దూరదృష్టి లేకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని అసహనం వ్యక్తం చేశాడు. ప్రతి ఒక్కరూ క్రీడలను నియంత్రించే వ్యవస్థలనే తప్పుబడుతున్నారని, మరి, పాక్ క్రీడాకారులకు మద్దతు తెలిపేందుకు బాధ్యత తీసుకుంటారని అతడు ప్రశ్నించాడు. ఆర్థిక సాయం అవసరమున్న క్రీడాకారుల గురించి చెప్పాలని, వారు వారి కలలను సాధించేందుకు సహకారం అందించాలని పిలుపునిచ్చాడు.