నేడు తేలిపోనున్న యడియూరప్ప భవితవ్యం
- యడియూరప్ప రాజీనామా చేసే అవకాశం?
- నిర్ణయాన్ని ప్రకటించనున్న బీజేపీ అధిష్ఠానం
- రేపు తన కార్యాచరణ గురించి ప్రకటించనున్న యడియూరప్ప
కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప రాజీనామా చేస్తారా? అన్న విషయం నేడు వెల్లడయ్యే అవకాశం ఉంది. బీజేపీ అధిష్ఠానం ఆయన గురించి ఏ నిర్ణయం తీసుకుందో ఈ రోజు ప్రకటించనుంది. యడియూరప్పను సీఎం పదవి నుంచి తప్పించనున్నారని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే.
ఆయనపై పలు ఆరోపణలు రావడంతో పదవి నుంచి తప్పించాలని బీజేపీ అధిష్ఠానం కూడా నిర్ణయానికి వచ్చినట్లు ఇటీవల ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఇటీవలే ఢిల్లీకి వెళ్లిన యడియూరప్ప బీజేపీ అధిష్ఠానాన్ని కలిసి చర్చలు జరిపారు.
తన భవిష్యత్తుపై ఈ నెల 25న (నేడు) బీజేపీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని అనుసరించి నడుచుకుంటానని స్పష్టం చేశారు. బీజేపీ తన నిర్ణయాన్ని ప్రకటించనున్న నేపథ్యంలో రేపు తన కార్యాచరణ గురించి ప్రకటిస్తానని ఆయన అన్నారు.
దీంతో రేపు కర్ణాటక నాయకత్వ మార్పు జరిగే అవకాశం ఉంది. ఆ రాష్ట్రంలో యడియూరప్ప సర్కారుకు రేపటితో రెండేళ్లు పూర్తవుతాయి. ఆయన వయసు 78 సంవత్సరాలు. బీజేపీ నిబంధనల ప్రకారం 75 ఏళ్లు దాటితే ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకోవాలి.