టోక్యో ఒలింపిక్స్ టెన్నిస్ మహిళల డబుల్స్‌లో సానియా జోడి ఓటమి
- తొలి రౌండ్‌లోనే ఉక్రెయిన్ చేతిలో ఓటమి
- సానియా జోడిపై గెలిచిన లియుడ్మిలా కిచెనోక్, నదియా కిచెనోక్
- భారత్‌పై ఉక్రెయిన్ 6-0, 6-7, 8-10 తేడాతో విజయం
టోక్యో ఒలింపిక్స్ టెన్నిస్ మహిళల డబుల్స్‌లో సానియా మిర్జా జోడి ఓటమి పాలైంది. తొలి రౌండ్‌లోనే ఉక్రెయిన్‌కు చెందిన కవలలు లియుడ్మిలా కిచెనోక్, నదియా కిచెనోక్.. సానియా మిర్జా, అంకితా రైనా జోడిని ఓడించారు. భారత్‌పై ఉక్రెయిన్ 6-0, 6-7, 8-10 తేడాతో గెలిచింది.
మొదట బాగానే రాణించిన సానియా మిర్జా, అంకితా ఆ తర్వాత ఏ మాత్రం రాణించలేకపోయారు. తొలి సెట్‌ను 6-0తో కైవసం చేసుకోగా, అనంతరం రెండు సెట్లలో ఓడిపోయారు. మొదట సానియా జోడి రెండో సెట్‌లో 5-3 తేడాతో లీడ్‌లో కొనసాగింది. ఆ తర్వాత మాత్రం ఉక్రెయిన్ క్రీడాకారిణులపై సానియా జోడి పైచేయి సాధించలేకపోయింది.