ఇండోనేషియాలో కరోనా బీభత్సం.... భారత్ చేయూత
- డెల్టా వేరియంట్ విలయం
- గత కొన్నివారాలుగా అత్యధిక సంఖ్యలో కేసులు
- తీవ్ర సంక్షోభం నడుమ ఇండోనేషియా
- కాన్సంట్రేటర్లు, ఆక్సిజన్ పంపిన భారత్
కరోనా సెకండ్ వేవ్ పలు దేశాలను అతలాకుతలం చేస్తోంది. కొన్ని నెలల కింద భారత్ కరోనా డెల్టా వేరియంట్ దెబ్బకు విలవిల్లాడిపోయింది. ఆక్సిజన్ కొరత, కరోనా మరణాలు, ప్రాణాధార ఔషధాల లభ్యత లేకపోవడంతో దేశం తీవ్ర సంక్షోభాన్ని చవిచూసింది. ప్రస్తుతం ఆ పరిస్థితుల నుంచి చాలావరకు గట్టెక్కినట్టే భావించాలి. కాగా, ఇండోనేషియాలో ఇప్పుడు కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. అక్కడ కూడా డెల్టా వేరియంటే అత్యధిక ప్రభావం చూపుతోంది.
ఈ నేపథ్యంలో, తన మిత్ర దేశానికి భారత్ చేయూతనిస్తోంది. నేడు 300 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, 100 మెట్రిక్ టన్నుల ద్రవరూప మెడికల్ ఆక్సిజన్ ను ఇండోనేషియాకు అందించింది. భారత నావికాదళానికి చెందిన ఓ నౌకలో వీటిని ఇండోనేషియా రాజధాని జకార్తా తరలించారు. గత కొన్నివారాలుగా ఇండోనేషియాలో కరోనా డెల్టా వేరియంట్ కేసులు అత్యధిక సంఖ్యలో నమోదవుతున్నాయి.