ఓవైపు మెదడుకు శస్త్రచికిత్స జరుగుతుండగా హనుమాన్ చాలీసా చదివిన మహిళ

  • ఓ యువతికి మెదడులో కణితి
  • నిన్న శస్త్రచికిత్స నిర్వహించిన ఎయిమ్స్ వైద్యులు
  • 3 గంటల పాటు ఆపరేషన్
  • 40 శ్లోకాలు చదివిన యువతి
ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యులు నిన్న ఓ 24 ఏళ్ల యువతికి మెదడు శస్త్రచికిత్స నిర్వహించారు. మెదడులో కణితి ఉండడంతో శస్త్రచికిత్స తప్పలేదు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... ఓవైపు డాక్టర్లు తన మెదడుకు ఎంతో సంక్లిష్టమైన శస్త్రచికిత్స చేస్తుండగా, ఆ యువతి ఎంతో భక్తితో హనుమాన్ చాలీసా చదివింది. ఆపరేషన్ జరుగుతున్న సమయంలో 40 శ్లోకాలను పఠించింది. ఈ శస్త్రచికిత్స దాదాపు 3 గంటల పాటు జరిగింది.

దీనిపై ఎయిమ్స్ వైద్య నిపుణుడు డాక్టర్ దీపక్ గుప్తా వివరాలు తెలిపారు. ఆమెకు లోకల్ అనెస్థీషియా (స్థానికంగా మత్తు) ఇవ్వడంతో పాటు నొప్పి నివారణ ఔషధాలు కూడా వాడామని వెల్లడించారు. ఇక, మెదడు ఆపరేషన్ల సందర్భంగా రోగులు మెలకువతో ఉండాల్సిన అవసరాన్ని ఆయన వివరించారు. రోగులు మెలకువతో ఉండడం వల్ల వారి మెదడులోని ఏ కీలక భాగం కూడా శస్త్రచికిత్స వల్ల నష్టపోయే ప్రమాదం ఉండదని వెల్లడించారు.


More Telugu News