ఈ నెల 28న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
- ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
- తాజా అల్పపీడనంతో ఏపీపై ప్రభావం
- ఏపీకి వర్ష సూచన
- ఆగస్టు 3 వరకు తేలికపాటి వర్షాలు
వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, దానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడ్డాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ తాజా నివేదిక విడుదల చేసింది. ఈ నెల 28న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తాంధ్రలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఒకట్రెండు చోట్లు మోస్తరు వర్షపాతం నమోదవుతుందని వివరించింది. తీరం వెంట 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. ఆగస్టు 3 వరకు కోస్తాంధ్ర, రాయలసీమలో తేలికపాటి వానలు కురుస్తాయని తెలిపింది.