ఈ ఆందోళనలన్నీ తుది దశ ఉద్యమానికి సంకేతాలు!​: రేవంత్​ రెడ్డి హెచ్చరిక

  • తెలంగాణ భవన్ ఉద్యోగాల్లో వివక్షపై ఆగ్రహం
  • కేసీఆర్ పాలనలో గల్లీ నుంచి ఢిల్లీ దాకా అన్యాయం  
  • 'సిద్ధంగా ఉండు కేసీఆర్' అంటూ హెచ్చరిక 
కేసీఆర్ ప్రభుత్వంపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఉద్యోగాలు కావాలన్న ఉద్యమ ఆకాంక్షకు ప్రభుత్వం తూట్లు పొడిచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ తెలంగాణ భవన్ లో ఉత్తరాది వారినే ఎక్కువగా నియమించారని, తెలంగాణ వారిపట్ల వివక్ష చూపిస్తున్నారని ఆరోపిస్తూ తెలంగాణ భవన్ ముందు నిన్న విద్యార్థులు ఆందోళన చేయడం జరిగింది. దానిపై స్పందిస్తూ రేవంత్ ట్వీట్ చేశారు.

‘‘మన ఉద్యోగాలు మనకు కావాలన్న ఉద్యమ ఆకాంక్షలకు టీఆర్ఎస్ ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. కేసీఆర్ పాలనలో గల్లీ నుంచి ఢిల్లీ దాకా అన్యాయం ఎన్నో రెట్లు ఎక్కువైంది. ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో తెలంగాణ బిడ్డలకు ఎదురవుతున్న వివక్షే అందుకు నిదర్శనం. ఈ ఆందోళనలన్నీ తుది దశ ఉద్యమానికి సంకేతాలు. సిద్ధంగా ఉండు కేసీఆర్’’ అంటూ ఆయన హెచ్చరించారు.


More Telugu News