హుజూరాబాద్‌లో ఈటల గెలిచాక నేరుగా అయోధ్యకు వెళతాం: బండి సంజయ్
- రాష్ట్ర మంత్రులు గుట్కా, గంజాయి, డ్రగ్స్ తీసుకుంటారు
- అటువంటి వారు ఈటలను ఓడించగలరా?
- ఈటల పాదయాత్రతో కేసీఆర్ కు నిద్ర పట్టడం లేదు
- హైదరాబాదులో అతి పెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం
తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో ఖాళీ అయిన హుజూరాబాద్ నియోజక వర్గానికి ఉప ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హుజూరాబాద్‌లో బలం పెంచుకోవడానికి ప్రధాన పార్టీల నేతలు ఆ ప్రాంతంలో పర్యటనలు జరుపుతున్నారు. ఈ రోజు హుజూరాబాద్‌లో పర్యటిస్తోన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ మంత్రులపై విమర్శలు గుప్పించారు. వారు గుట్కా, గంజాయి, డ్రగ్స్ తీసుకుంటారని, అటువంటి వారు ఈటలను ఓడించగలరా? అని ప్రశ్నించారు.
హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈటల రాజేందర్ గెలిచిన అనంతరం నేరుగా అయోధ్యకు వెళతామని చెప్పారు. హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్ పాదయాత్ర చేస్తుండడంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నిద్ర పట్టడం లేదని ఆయన అన్నారు. దళిత బంధు పథకాన్ని సీఎం కేసీఆరే నిలిపేసి, ఆ నెపాన్ని తమ పార్టీ మీదకు నెట్టేస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక హైదరాబాద్ లో తాము అతి పెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని, ఈ విషయంలో గతంలో కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని విమర్శించారు.