జగన్ గారూ, ఇప్పటికైనా కేసీఆర్ దగ్గరికెళ్లి సమస్యను సామరస్యంగా పరిష్కరించండి: సోమిరెడ్డి
- కృష్ణా డెల్టాకు 70 టీఎంసీల గోదావరి నీళ్లు అందుబాటులోకి..
- రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు శ్రీశైలం నుంచి నికరజలాలు కేటాయించండి
- ఈ మేరకు జీఓ ఇవ్వండి
తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదంపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందిస్తూ ఏపీ ముఖ్యమంత్రి జగన్‌పై విమర్శలు గుప్పించారు. ఈ సమస్యను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించి పరిష్కరించాలని జగన్‌కు ఆయన సూచించారు.
'వైఎస్ జగన్ గారూ, ఇప్పటికైనా కేసీఆర్ దగ్గరికెళ్లి సమస్యను సామరస్యంగా పరిష్కరించండి. కృష్ణా డెల్టాకు 70 టీఎంసీల గోదావరి నీళ్లు అందుబాటులోకి వచ్చిన క్రమంలో ఆ మేర రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు శ్రీశైలం నుంచి నికర జలాలు కేటాయిస్తూ జీఓ ఇవ్వండి' అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.