ఒలింపిక్స్ లో పాల్గొంటున్న భారత అథ్లెట్లకు సీఎం జగన్, చిరంజీవి శుభాకాంక్షలు

  • టోక్యోలో ఒలింపిక్స్ ప్రారంభం
  • పరిపూర్ణ విజయం సాధించాలన్న సీఎం జగన్
  • దేశాన్ని గర్వించేలా చేయాలని ఆకాంక్ష
  • సహజ నైపుణ్యం చాటాలన్న చిరంజీవి
జపాన్ రాజధాని టోక్యోలో ఒలింపిక్ క్రీడలు ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి భారత అథ్లెట్లకు శుభాకాంక్షలు తెలిపారు. భారత అథ్లెటిక్ బృందానికి ఒలింపిక్స్ లో పరిపూర్ణ విజయం దక్కాలని కోరుకుంటున్నట్టు సీఎం జగన్ తెలిపారు. యావత్ దేశం గర్వించేలా చేస్తారని భావిస్తున్నామని, చిరస్మరణీయంగా మిగిలిపోయేలా చారిత్రక క్షణాలను ఆవిష్కరిస్తారని ఆశిస్తున్నామని తెలిపారు. "వీ ఆర్ టీమిండియా" అంటూ భారత అథ్లెట్లకు సంఘీభావాన్ని ప్రకటించారు.

చిరంజీవి స్పందిస్తూ, 'టోక్యోలో ప్రారంభమైన విశ్వక్రీడోత్సవం ఒలింపిక్స్ లో పాల్గొంటున్న భారత బృందానికి శుభాకాంక్షలు' అంటూ ట్వీట్ చేశారు. 'భారత క్రీడాకారులు తమ సహజ ప్రతిభాపాటవాలు ప్రదర్శించి దేశానికి గర్వకారణం కావాలని కోరుకుంటున్నాను' అని పేర్కొన్నారు. స్వర్ణ పతకాలతో తిరిగిరావాలని ఆకాంక్షించారు.


More Telugu News