శ్రీలంకతో చివరి వన్డే... టీమిండియా 225 ఆలౌట్

  • భారత్, లంక మధ్య చివరి వన్డే
  • కొలంబో వేదికగా మ్యాచ్
  • వర్షం కారణంగా 47 ఓవర్లకు కుదింపు
  • రాణించిన లంక స్పిన్నర్లు
కొలంబోలో శ్రీలంకతో చివరి వన్డేలో టీమిండియా ఓ మోస్తరు స్కోరు నమోదు చేసింది. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్ ను 47 ఓవర్లకు కుదించగా, టీమిండియా 43.1 ఓవర్లలో 225 పరుగులకు ఆలౌటైంది. లంక స్పిన్నర్లు ప్రవీణ్ జయవిక్రమ, అఖిల ధనంజయ చెరో 3 వికెట్లు తీసి భారత్ ను దెబ్బతీశారు. దుష్మంత చమీర 2 వికెట్లు తీయగా, చమిక కరుణరత్నే, కెప్టెన్ దసున్ షనక చెరో వికెట్ దక్కించుకున్నారు.

టీమిండియా ఇన్నింగ్స్ లో ఓపెనర్ పృథ్వీ షా 49, వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ సంజు శాంసన్ 46, సూర్యకుమార్ యాదవ్ 40 పరుగులు చేశారు. మూడు వన్డేల సిరీస్ ను టీమిండియా ఇప్పటికే 2-0తో చేజిక్కించుకోగా, ఇవాళ్టి మ్యాచ్ అప్రాధాన్యంగా మారింది. అందుకే భారత్, లంక జట్లు కొత్త కుర్రాళ్లకు అవకాశం ఇచ్చాయి.


More Telugu News