కరోనా నేపథ్యంలో.. అల్లవరంలో ఈ నెలాఖరు వరకు కర్ఫ్యూ

  • అల్లవరంలో కొనసాగుతున్న కరోనా ఉద్ధృతి
  • మధ్యాహ్నం 2 నుంచి మరుసటి రోజు ఉదయం 6 వరకు కర్ఫ్యూ విధింపు
  • ఆంక్షలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
ఏపీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం పెద్ద సంఖ్యలోనే కేసులు నమోదవుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లా అల్లవరంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. దీంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అల్లవరంలో ఈ నెల 30 వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్టు ప్రకటించింది.

ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే దుకాణాలు, వ్యాపార సముదాయాలు తెరిచి ఉంటాయని... మధ్యాహ్నం 2 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని అధికారులు తెలిపారు. ఆంక్షలను అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మరోవైపు ఏపీలో నైట్ కర్ఫ్యూని ఈనెల 26 వరకు పొడిగించిన  సంగతి తెలిసిందే.


More Telugu News