కేసీఆర్ కార్యాలయంలో ఒక్క దళిత అధికారి కూడా లేరు: వైయస్ షర్మిల
- కేసీఆర్ ఏడేళ్ల పాలనలో దళితులపై దాడులు పెరిగాయి
- దళిత ఐఏఎస్ అధికారులకు అవమానాలే ఎదురయ్యాయి
- ప్రాధాన్యత లేని శాఖలను దళిత ఐఏఎస్ లకు కేటాయిస్తున్నారు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైయస్సార్టీపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. హుజూరాబాద్ ఎన్నికల్లో దళితుల ఓట్ల కోసం కేసీఆర్ దొర తెచ్చిన దళితబంధుతో దళితుల బతుకుల్లో అభివృద్ధిని తీసుకొస్తారో లేదో కానీ... ఏడేండ్ల పాలనలో దళితులపై జరిగిన దాడుల్లో మాత్రం అభివృద్ధి చేసి చూపారని మండిపడ్డారు.
2014-15లో దళితులపై 287 దాడులు జరిగితే... ఏడేళ్లలో దాడులు 826 శాతం పెరిగి 8,818 కేసులు నమోదయ్యాయని అన్నారు. కేసీఆర్ పాలనలో దళితులపై దాడులే కాక... దళిత ఐఏఎస్ అధికారులకు కూడా అవమానాలే ఎదురయ్యాయని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఒక్క దళిత అధికారి కూడా లేరని విమర్శించారు.
ప్రాధాన్యత లేని శాఖలకు దళిత ఐఏఎస్ లను నియమిస్తున్నారని అన్నారు. దళిత సాధికారత కోసం దళితులకు కేసీఆర్ దొర ఇస్తున్న గౌరవాన్ని చూసిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సంతోష్, ప్రవీణ్ కుమార్, ఆకునూరి మురళిలు సర్వీసు ఉన్నా ఉద్యోగాలకు రాజీనామా చేశారని చెప్పారు.