తిరుమలలో యాంటీ డ్రోన్ టెక్నాలజీ.. డీ-4 డ్రోన్ టెక్నాలజీని కొనుగోలు చేస్తున్న టీటీడీ

  • డీ-4 టెక్నాలజీని అభివృద్ధి చేసిన డీఆర్డీవో
  • నాలుగు కి.మీ. పరిధిలో డ్రోన్లను గుర్తించి దాడి చేసే టెక్నాలజీ
  • డ్రోన్లలోని కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ను జామ్ చేసే శక్తి
తిరుమలకు ఉగ్రముప్పు పొంచి ఉందని భద్రతా సంస్థలు హెచ్చరించిన నేపథ్యంలో... టీటీడీ పూర్తి స్థాయిలో అలర్ట్ అయింది. అత్యున్నత టెక్నాలజీని ఉపయోగించి, ఉగ్ర కుట్రలను తిప్పికొట్టేందుకు సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగా డ్రోన్ జామర్ టెక్నాలజీని తిరుమల కొండపై ఉపయోగించేందుకు సిద్ధమవుతున్నారు. డ్రోన్ల దాడులను నివారించేందుకు డీఆర్డీఓ యాంటీ డ్రోన్ టెక్నాలజీని తయారు చేసింది. ఈ టెక్నాలజీని తిరుమల ఆలయ రక్షణ వ్యవస్థలో ఉపయోగించనున్నారు.

జమ్ములోని ఎయిర్ బేస్ పై ఉగ్రదాడి జరిగిన తర్వాత ఈ టెక్నాలజీని డీఆర్డీవో తయారు చేసింది. జులై 6న ఈ టెక్నాలజీని కర్ణాటకలోని కోలార్ వద్ద ప్రదర్శించింది. ఈ టెక్నాలజీని తొలిసారి ఏర్పాటు చేస్తున్న ఘనత టీటీడీకి దక్కబోతోంది. రూ. 22 కోట్లతో ఈ టెక్నాలజీని కొనుగోలు చేస్తోంది. డీ-4 డ్రోన్ టెక్నాలజీగా పిలిచే దీని ద్వారా డ్రోన్ డాడుల ముప్పును ఎదుర్కోవచ్చు. నాలుగు కిలోమీటర్ల పరిధిలో డ్రోన్లను ఈ వ్యవస్థ గుర్తించి దాడి చేస్తుంది. ఈ వ్యవస్థలో అనేక సెన్సార్లు, డ్రోన్లపై ఎదురు దాడి చేసే రెండు విధ్వంసకర పరికరాలు ఉన్నాయి. ఈ టెక్నాలజీ డ్రోన్లలోని కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ను జామ్ చేస్తుంది.

TTD

More Telugu News