చరణ్-శంకర్ సినిమాపై లేటెస్ట్ ఇన్ఫో!

చరణ్-శంకర్ సినిమాపై లేటెస్ట్ ఇన్ఫో!
  • చరణ్-శంకర్ కాంబోలో దిల్ రాజు ప్రాజక్ట్ 
  • మూడు భాషల్లో పాన్ ఇండియా సినిమా
  • ద్విపాత్రాభినయం చేయనున్న చరణ్
  • తండ్రీకొడుకుల పాత్రలలో మెగా పవర్ స్టార్  
ప్రస్తుతం టాలీవుడ్ లో కనిపిస్తున్న క్రేజీ ప్రాజక్టులలో రామ్ చరణ్ సినిమా కూడా వుంది. దక్షిణాది హీరోలంతా పనిచేయాలని కోరుకునే సూపర్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చరణ్ చేయనున్న చిత్రమే ఇది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని పాన్ ఇండియా సినిమాగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో భారీ బడ్జెట్టుతో నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

చరణ్ నటిస్తున్న 15వ సినిమా అయిన దీనికి సంబంధించి ఓ తాజా వార్త ప్రచారంలోకి వచ్చింది. ఇందులో చరణ్ ద్విపాత్రాభినయం చేయనున్నట్టు ఇంతకుమునుపు వార్తలొచ్చాయి. ఆ రెండు పాత్రల గురించి ఇప్పుడు ఓ టాక్ వినవస్తోంది. అదేమిటంటే, చరణ్ ఇందులో తండ్రీకొడుకులుగా రెండు విభిన్న పాత్రలను పోషిస్తాడట. ఈ రెండు పాత్రలను ఎంతో కొత్తగా.. వైవిధ్యంతో దర్శకుడు శంకర్ డిజైన్ చేసినట్టు చెబుతున్నారు. ఎనిమిదేళ్ల క్రితం 'నాయక్' సినిమాలో చరణ్ డ్యూయల్ రోల్స్ పోషించాడు. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తుండడంతో ఈ సినిమా ఓ ప్రత్యేకతను సంతరించుకుంది.

ఇక ఇందులో ఇద్దరు కథానాయికలు నటిస్తారని సమాచారం. వారెవరన్నది త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తారు. నేటి బిజీ రచయిత సాయిమాధవ్ బుర్రా మాటలు రాస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.


More Telugu News