శ్రీలంకతో చివరి వన్డేలో టాస్ గెలిచిన టీమిండియా
- కొలంబోలో భారత్ వర్సెస్ శ్రీలంక
- బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా
- ఇప్పటికే వన్డే సిరీస్ గెలిచిన ధావన్ సేన
- పరువు దక్కించుకునేందుకు లంక పోరాటం
శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్ ను 2-0తో గెలిచిన టీమిండియా ఇవాళ నామమాత్రపు చివరి వన్డే ఆడుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 3 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 29 పరుగులు చేసింది. కెప్టెన్ శిఖర్ ధావన్ 3 ఫోర్లతో 13 పరుగులు చేసి చమీర బౌలింగ్ లో అవుటయ్యాడు. మరో ఓపెనర్ పృథ్వీ షా 10 పరుగులతో ఆడుతున్నాడు. ఈ మ్యాచ్ లో సంజు శాంసన్ కు అవకాశం ఇచ్చారు. ధావన్ అవుట్ కావడంతో వన్ డౌన్ లో శాంసన్ బరిలో దిగాడు.
ఈ సిరీస్ లోని తొలి రెండు మ్యాచ్ లు టీమిండియా గెలవడంతో శ్రీలంక సొంతగడ్డపై ఘోరపరాభవం ఎదుర్కొంది. కనీసం ఈ మ్యాచైనా గెలిచి పరువు దక్కించుకోవాలనుకుంటోంది.
ఈ మ్యాచ్ లో భారత్ ఐదుగురు కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇచ్చింది. శాంసన్, నితీశ్ రాణా, సకారియా, గౌతమ్ కృష్ణప్ప, రాహుల్ చహర్ తమ కెరీర్లో తొలి అంతర్జాతీయ వన్డే ఆడుతున్నారు.