అమెరికా ప్ర‌తినిధుల స‌భ‌కు పోటీ చేయ‌నున్న భార‌త సంత‌తి మ‌హిళ‌

  • వ‌చ్చే ఏడాది న‌వంబ‌రులో జ‌ర‌గ‌నున్న ఎన్నికలు
  • కాలిఫోర్నియా సీఏ-42 స్థానం నుంచి  శ్రినా కుర‌ణి పోటీ
  • ఇప్ప‌టికే ప్ర‌తినిధుల స‌భ‌లో న‌లుగురు భార‌త సంత‌తి నేత‌లు
అమెరికా ప్ర‌తినిధుల స‌భ‌కు వ‌చ్చే ఏడాది న‌వంబ‌రులో జ‌ర‌గ‌నున్న మ‌ధ్యంత‌ర‌ ఎన్నిక‌ల్లో కాలిఫోర్నియా సీఏ-42 స్థానం నుంచి భార‌త సంత‌తికి చెందిన ఇంజనీర్‌, ఔత్సాహిక పారిశ్రామికవేత్త శ్రినా కుర‌ణి పోటీ చేయ‌నున్నారు. ఈ విష‌యాన్ని ఆమె స్వ‌యంగా ప్ర‌క‌టించారు. తాను ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా ప‌ని చేయాల‌నుకుంటున్నాన‌ని ఆమె చెప్పారు. రిప‌బ్లిక‌న్ నేత కెన్ కాల్వ‌ర్ట్‌పై ఆమె పోటీకి దిగ‌నున్నారు.

కెన్ కాల్వ‌ర్ట్ 30 ఏళ్ల నుంచి ప‌ద‌విలో ఉన్నార‌ని, అయినప్ప‌టికీ ఆయ‌న ప్రాతినిధ్యం వ‌హిస్తోన్న ప్రాంతానికి ఏమీ చేయ‌లేకపోయార‌ని శ్రినా కుర‌ణి విమ‌ర్శ‌లు గుప్పించారు. కాగా, శ్రినా కుర‌ణి లా సిరా హైస్కూల్ లో చదివారు. కాలిఫోర్నియా విశ్వవిద్యాల‌యం నుంచి ఆమె మెకానిక‌ల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఆహార వ్య‌ర్థాల నియంత్ర‌ణపై ప‌నిచేస్తోన్న‌ స్టార్ట‌ప్ కంపెనీల్లో ఆమె ప‌ని చేశారు. ప్ర‌స్తుతం అమెరికా ప్ర‌తినిధుల స‌భ‌లో భార‌త సంత‌తికి చెందిన డాక్ట‌ర్ అమి బెరా, రో ఖ‌న్నా, రాజా కృష్ణ‌మూర్తి, పరిమ‌లా జ‌య‌పాల్ ఉన్నారు.

  



More Telugu News