పెట్రోల్, డీజిల్ పై రాష్ట్ర సుంకాన్ని ఎందుకు తగ్గించడం లేదు జగన్ గారు?: గోరంట్ల బుచ్చయ్య చౌదరి

  • పెట్రోల్, డీజిల్ కేంద్ర పరిధిలోని అంశాలని అంటున్నారు
  • రాష్ట్ర సుంకాన్ని తగ్గించడం మీ చేతిలోనే ఉంది కదా?
  • మీ పప్పు, బెల్లాలు పంచడానికి ఆదాయం కావాలి
మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్న సంగతి తెలిసిందే. అన్ని ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ధర సెంచరీ దాటేసింది. ఇంధన ధరలు పెరగడం అన్ని రంగాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. నిత్యావసరాల ధరలు కూడా అమాంతం పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వంపై టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శలు గుప్పించారు.

పెట్రోల్, డీజిల్ కేంద్ర పరిధిలోని అంశాలని అంటున్నారని... మరి వీటిపై ఉన్న రాష్ట్ర సుంకాన్ని ఎందుకు తగ్గించరు ముఖ్యమంత్రి జగన్ గారూ? అని గోరంట్ల ప్రశ్నించారు. రాష్ట్ర సుంకాన్ని తగ్గించడం మీ చేతిలోనే ఉంది కదా? అని అన్నారు. మీ పప్పు, బెల్లాలు పంచడానికి ఆదాయం కావాలి అని ఎద్దేవా చేశారు. ఇష్టానుసారంగా ధరలు పెంచడం... పేదలకు ఇస్తున్నట్టు మాటలు చెప్పడం మీకే చెల్లిందని విమర్శించారు.


More Telugu News